టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ

BCCI Unveils Team India's New Jersey Ahead of T20 World Cup From Next Month in Australia, BCCI Unveils India's New Jersey, India's New Jersey, India's New Jersey For T20 World Cup , T20 World Cup Australia Tour, Mango News, Mango News Telugu, T20 World Cup 2022, BCCI New Team, ICC Mens T20 World Cup 2022, ICC Mens Team, ICC Mens Indian Team, Indian Team New Jersey, T20 World Cup Latest News And Updates

వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ మొదలవనుంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. కాగా గత కొన్ని రోజులుగా టీమిండియా కొత్త జెర్సీతో టీ20 ప్రపంచకప్‌ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ ఆదివారం బీసీసీఐ కొత్త జెర్సీని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసింది. బీసీసీఐ విడుదల చేసిన ఈ ఫొటోలో.. పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్‌శర్మ, సభ్యులు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహిళల జట్టు కెప్టెన్ హర్మ‌న్‌ప్రీత్ కౌర్, సభ్యులు షెఫాలీ వర్మ, రేణుకా సింగ్ లు కొత్త జెర్సీతో కనిపించారు.

‘ప్రతి క్రికెట్ అభిమాని కోసం, టీమిండియా కొత్త టీ20 జెర్సీ, ఒక బ్ల్యూ జెర్సీ’ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత జెర్సీ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్ కంపెనీ ప్రతినిధులతో కలిసి బీసీసీఐ దీనిని విడుదల చేసింది. ఇక కొత్త జెర్సీలో డ్యూయల్ టోన్ తో తీర్చిదిద్దారు. భుజాలు, స్లీవ్స్ వద్ద ముదురు నీలం రంగు, అలాగే మిగిలిన భాగంలో కిట్‌కు లైట్ బ్లూ షేడ్‌ను వాడారు. మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో మొదలవనున్న 3టీ20 మ్యాచ్ ల సిరీస్ నుంచే టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీని ధరించనున్నారు. ఇక లేతనీలం రంగులో ఉన్న జెర్సీ అభిమానులకు బాగా నచ్చింది. దీనిపై వారు పాజిటివ్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 4 =