రేపే సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం, కీలక నిర్ణయాలు?

CM KCR to Chair TRSLP Party State Executive Committee Meetings Tomorrow, CM KCR to Chair TRSLP, Party State Executive Committee Meeting,TRSLP Meeting,Mango News,Mango News Telugu,TRS Govt, Telangana Politics Latest News And Updates,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates,TRS Party

టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (నవంబర్ 15, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు), టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సంయుక్త సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు సహా పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ నేతలు హాజరుకానున్నారు.

ఈ సమావేశం సందర్భంగా పార్టీకి సంబంధించిన కొత్త నిర్ణయాలు, బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, మునుగోడు ఉపఎన్నిక గెలుపు విశ్లేషణ, బీజేపీపై పోరాటం, ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సహా పలు అంశాలపై కీలకంగా చర్చంచి, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =