టీ20 ప్రపంచ కప్ 2022: ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్‌, ఫైనల్స్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం

T20 World Cup 2022 Ben Stokes and Sam Curran Guide England To 5-Wicket Win Against Pakistan in Finals, Eng Won Over Pak,England Won T20 World Cup,T20 World Cup-2022 ,Pakistan vs England,PAK vs ENG,Mango News,Mango News Telugu,Pakistan Cricket Team, England Cricket Team, PAK vs ENG Live Score, PAK vs ENG Match Live, Pakistan, England, Sam Curran Player Of Tournament,Rizwan Pakistan Player, Ben Stokes England Player,World Cup Final,T20 World Cup Final 2022

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన ఇంగ్లండ్‌ జట్టు ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా రెండోసారి ప్రపంచ కప్‌ చేజిక్కించుకుంది. కాగా 2010లో తొలిసారి ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. రెండు జట్లూ ఎలాంటి మార్పు లేకుండా సెమీ ఫైనల్స్‌లో ఆడిన ప్లేయర్స్ తోనే బరిలోకి దిగాయి. ఇక తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 రన్స్‌ చేసింది. ఆ జట్టులో షాన్‌ మసూద్‌ (38), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (32), షాదాబ్‌ ఖాన్‌ (20)లు పర్వాలేదనిపించగా.. రిజ్వాన్‌ (15), హరీస్‌ (8), నవాజ్‌ (5), ఇఫ్తిఖార్‌ (0) లు ఏమాత్రం రాణించలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సామ్ కర్రాన్ 3, ఆదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 రన్స్‌ చేసి విజయం సాధించింది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైన తుదికంటా పోరాడి జట్టుకి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి అలాంటి ప్రదర్శనే చేసి ఇంగ్లీష్ జట్టుకి ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ అందించాడు. బెన్ స్టోక్స్ అజేయ అర్ధ సెంచరీ (49 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌)కి కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (26), బ్రూక్‌ (20), మోయిన్‌ అలీ (19) సహకారం అందించారు. కాగా పాక్‌ బౌలర్లలో రవూఫ్‌ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (3/12) మరియు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ (ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు)గా సామ్ కర్రాన్ ఎంపికయ్యాడు. ఈ విజయంతో ఇంగ్లండ్‌ 2సార్లు టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన రెండో జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు వెస్టిండీస్‌ (2012, 2016లో) ఈ ఘనత సాధించింది. అలాగే టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం విశేషం. ఇక పాకిస్తాన్ తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు (98) తీసిన బౌలర్‌గా షాదాబ్‌ ఖాన్‌ నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రీది (97)ని అధిగమించాడు.

ఇరు జట్ల స్కోరు కార్డ్స్..

పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (బి) కర్రాన్‌ 15; బాబర్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 32; హరీస్‌ (సి) స్టోక్స్‌ (బి) రషీద్‌ 8; మసూద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కర్రాన్‌ 38; ఇఫ్తికార్‌ (సి) బట్లర్‌ (బి) స్టోక్స్‌ 0; షాదాబ్‌ (సి) వోక్స్‌ (బి) జోర్డాన్‌ 20; నవాజ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కర్రాన్‌ 5; వసీం జూనియర్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) జోర్డాన్‌ 4; షహీన్‌ (నాటౌట్‌) 5; రౌఫ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 137/8.

బౌలింగ్‌: స్టోక్స్‌ 4-0-32-1; వోక్స్‌ 3-0-26-0; కర్రాన్‌ 4-0-12-3; రషీద్‌ 4-1-22-2; జోర్డాన్‌ 4-0-27-2; లివింగ్‌స్టోన్‌ 1-0-16-0.

ఇంగ్లండ్‌: బట్లర్‌ (సి) రిజ్వాన్‌ (బి) రౌఫ్‌ 26; హేల్స్‌ (బి) షహీన్‌ 1; సాల్ట్‌ (సి) ఇఫ్తికార్‌ (బి) రౌఫ్‌ 10; స్టోక్స్‌ (నాటౌట్‌) 52; బ్రూక్‌ (సి) షహీన్‌ (బి) షాదాబ్‌ 20; మొయిన్‌ అలీ (బి) వసీం జూనియర్‌ 19; లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 19 ఓవర్లలో 138/5.

బౌలింగ్‌: షహీన్‌ 2.1-0-13-1; నసీమ్‌ షా 4-0-30-0; రౌఫ్‌ 4-0-23-2; షాదాబ్‌ 4-0-20-1; వసీం జూనియర్‌ 4-0-38-1; ఇఫ్తికార్‌ 0.5-0-13-0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 8 =