రేపు హైదరాబాద్‌లో స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీహబ్‌-2 ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR To Inaugurate The Second Phase of Start-up Incubator T hub-2 in Hyderabad Tomorrow, Telangana CM KCR To Inaugurate The Second Phase of Start-up Incubator T hub-2 in Hyderabad Tomorrow, KCR To Inaugurate The Second Phase of Start-up Incubator T hub-2 in Hyderabad Tomorrow, KCR To Launch New Facility Of T-Hub In Hitec City Spread Across 3.5 Lakh Sq Feet, Chief Minister KCR To Launch New Facility Of T-Hub In Hitec City Spread Across 3.5 Lakh Sq Feet, Telangana Chief Minister KCR To Launch New Facility Of T-Hub In Hitec City Spread Across 3.5 Lakh Sq Feet, New Facility Of T-Hub In Hitec City Spread Across 3.5 Lakh Sq Feet, New Facility Of T-Hub In Hitec City, New T-Hub In Hitec City, Hitec City, New T-Hub, Chief Minister of Telangana is scheduled to launch the Technology Hub's new facility, Technology Hub's new facility, Telangana New T-Hub News, Telangana New T-Hub Latest News, Telangana New T-Hub Latest Updates, Telangana New T-Hub Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలోనే తెలంగాణ స్టార్టప్‌ కంపెనీలకు దిక్సూచిగా నిలుస్తోంది. ఇప్పటికే ఎన్నో చిన్న, పెద్ద అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన రాజధాని నగరంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీహబ్‌-2 నిర్మితమైంది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో నిర్మించిన ఈ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కెటీ రామారావు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ ఇంక్యుబేటర్‌ సుమారు రూ. 276 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తిచేసుకుంది. 3,70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరియు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్‌లను కలిగి ఉండేలా ఇది రూపొందించబడింది.

5 రోడ్ల కూడలిలో నిర్మించిన ఈ భవనానికి రాకపోకలకు అనువుగా రహదారులను 100-120 అడుగుల వెడల్పుతో నిర్మించారు. అలాగే దీనికి సమీపంలో రాయదుర్గం మెట్రోస్టేషన్‌ ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ఇంకా నగరంలోని ఐటీ కారిడార్‌లోనే ఈ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ భవనాన్ని శాండ్‌విచ్‌ ఆకారంలో నిర్మించటం విశేషం. రేపు దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాలెడ్జ్‌ సిటీ ఎస్‌ఈజెడ్‌లోని అన్ని రోడ్లను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. రేపటి కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రతినిధులు హాజరవనున్నారు. కాగా మంత్రి కేటీఆర్ దీని నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twelve =