కర్ణాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Minister Talasani Srinivas Yadav Disburses Ex-gratia Cheques To The Families of Karnataka Bus Mishap Victims, Telangana Minister Talasani Srinivas Yadav Disburses Ex-gratia Cheques To The Families of Karnataka Bus Mishap Victims, Talasani Srinivas Yadav Disburses Ex-gratia Cheques To The Families of Karnataka Bus Mishap Victims, Ex-gratia Cheques To The Families of Karnataka Bus Mishap Victims, Karnataka Bus Mishap Victims, Ex-gratia Cheques, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Telangana Minister, Telangana Minister for Animal Husbandary, Telangana Minister Fisheries and Cinematography, Fisheries and Cinematography, Karnataka Bus Mishap Victims News, Karnataka Bus Mishap Victims Latest News, Karnataka Bus Mishap Victims Latest Updates, Karnataka Bus Mishap Victims Live Updates, Mango News, Mango News Telugu,

కర్ణాటకలో చోటుచేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రానికి చెందిన 7గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తన కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కలెక్టర్ శర్మన్ లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. జూన్ 2న గోవా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా కర్ణాటక రాష్ట్రం కలబురిగి వద్ద ప్రమాదానికి గురై బస్సులోనే సజీవదహనమైన ఏడుగురు ప్రయాణికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆరోజు సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడారని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పారని వెల్లడించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 అందించాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాలకు 24.50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయగా, ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మృతుల కుటుంబాలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం ఎక్స్‌గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 2 =