భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు, సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

CM KCR Urged People not to Venture out of Homes Unless there is an Emergency due to Heavy Rains, Telangana CM KCR Urged People not to Venture out of Homes Unless there is an Emergency due to Heavy Rains, KCR Urged People not to Venture out of Homes Unless there is an Emergency due to Heavy Rains, IMD Issues Red Alert Amid Heavy To Very Heavy Rainfall In Telangana For Next 2 Days, Heavy To Very Heavy Rainfall In Telangana For Next 2 Days, IMD Issues Red Alert, IMD Issues Red Alert For Telangana, Very Heavy Rainfall In Telangana, IMD Telangana Likely To Receive Heavy Rains in Next Two Days, IMD Says Telangana Likely To Receive Heavy Rains in Next Two Days, Heavy Rains in Next Two Days, IMD predicts heavy to very heavy rainfall in Telangana, Telangana, heavy to very heavy rainfall, India Meteorological Department, heavy to very heavy rainfall will continue in these states for next 2 days, Scattered rainfall likely over Telangana, Daily Weather Report, Daily Weather Forecast, Telangana Heavy Rains News, Telangana Heavy Rains Latest News, Telangana Heavy Rains Latest Updates, Telangana Heavy Rains Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల, తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్న నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని, పరిస్థితులను బట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు:

జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలని సీఎం అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టాలను జరగకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 5 =