తెలంగాణలో కరోనా : యాక్టీవ్ కేసులు 726, కొత్త కేసులు ఎన్నంటే?

Covid-19 in Telangana 110 New Positive Cases 129 Recoveries Reported on September 20, Telangana Records 110 New Covid Cases, 129 Covid Recoveries September 20, Mango News, Mango News Telugu, Telangana Logs 110 Covid Positive Cases, 110 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 726 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 110 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 20, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,36,907 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 48 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.42 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 129 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,32,070 కు చేరుకుంది. ప్రస్తుతం 726 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం నాడు 10,475 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,75,81,031 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,09,700 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 298 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =