తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,742 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరొకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1640 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 196 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 2,96,166 కు చేరుకుంది. ప్రస్తుతం 1,936 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాడు 40,712 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 89,24,007 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,39,763 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ