ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ

Mango News, Platform ticket price hike news, Platform ticket price hiked from Rs 10 to Rs 30, Platform ticket price increase, Platform ticket price raised from Rs 10 to Rs 30, Platform ticket price today, Railway Ministry Says Hike is a Temporary Measure, Railway Platform Ticket, Railway Platform Ticket Price, Railway Platform Ticket Price Hike, Railway Platform Ticket Price Increased, Railway Platform Ticket Price Increased to Rs 30, raising platform ticket prices to Rs 30

దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్‌ఫాం‌లపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను మరింతగా పెంచారు. ఇప్పటివరకు రూ.10గా ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ.30 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్‌ఫాంల వద్ద ప్రయాణికుల భద్రత, అనవసరమైన రద్దీని నివారించడానికే ప్లాట్‌ఫాం టిక్కెట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అయితే ప్లాట్‌ఫాం టికెట్ ధరల పెరుగుదల తాత్కాలిక చర్య అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

సాధారణంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరలు ఎప్పటికప్పుడు పరిస్థితుల అంచనా ఆధారంగా పెరుగుతాయని, ఈ విధానం చాలా సంవత్సరాలుగా ఆచరణలో ఉందని పేర్కొన్నారు. టికెట్ ధరల పెరుగుదల కొంత సమయానికి ప్రయాణికుల రద్దీని నివారించే కొలతగా ఉంటుందని చెప్పారు. మరోవైపు పెరిగిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలను దేశంలోని అన్ని జోన్లలో వెంటనే అమల్లోకి తేవాలని రైల్వే శాఖ ఆదేశాలు ఇచ్చింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =