తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్కరోజే 1831 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

Covid-19 in Telangana, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 6 సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 6,383 శాంపిల్స్ పరీక్షించగా 4,552 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1419, రంగారెడ్డిలో 160, మేడ్చల్ లో 117, ఖమ్మంలో 21, మంచిర్యాలలో 20, మెదక్ లో 20 నమోదయ్యాయి. కాగా సోమవారం నాడు అత్యధికంగా 2078 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 6, సాయంత్రం 5 గంటల వరకు) :

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 25,733
కొత్తగా నమోదైన కేసులు (జూలై 5- జూలై 6 (5PM-5PM) : 1831
నమోదైన మరణాలు : 11
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 14781
యాక్టీవ్ కేసులు : 10646
మొత్తం మరణాల సంఖ్య : 306

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − six =