తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 45 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2392 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,163 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 60,923 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 906 కి పెరిగింది. ఇప్పటివరకు 1,12,587 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 31,670 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.5 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.62 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2392):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu