తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 50 వేలు దాటింది. సెప్టెంబర్ 9, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,176 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు కొత్తగా 2534 కేసులు నమోదవగా, 63,017 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 927 కి పెరిగింది. రాష్ట్రంలో 1,17,143 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 32,106 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.61 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2534):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu