తెలంగాణలో రాష్ట్రంలో మరో 2384 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 22, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,04,249 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 40,666 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 9,31,839 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 25,099 నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 22, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 9,31,839
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,04,249
- కొత్తగా నమోదైన కేసులు : 2384
- నమోదైన మరణాలు : 11
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 80,586
- కరోనా రికవరీ రేటు: 77.30%
- యాక్టీవ్ కేసులు: 22,908
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 16,379
- మొత్తం మరణాల సంఖ్య : 755
- కరోనా మరణాల రేటు: 0.72%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu