బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం – ఆర్థిక మంత్రి హరీశ్ రావు

Finance Minister Harish Rao says Gave Equal Importance to Welfare and Development in the State Budget 2023-24,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Mango News Telugu,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ను నేడు (ఫిబ్రవరి 6, సోమవారం) శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హరీశ్ రావు, శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బడ్జెట్‌ దస్త్రాలతో మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ, రాష్ట్ర 2023-24 బడ్జెట్ ను ఈరోజు శాసనసభ, శాసనమండలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రవేశపెడుతున్నాం. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపొందించామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here