మహిళలు, పిల్లలపై నేరాలుపై పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష

Home Minister Mahmood Ali Held High Level Police Officers Meeting on Crime Against Women and Children, Telangana Home Minister Mahmood Ali Held High Level Police Officers Meeting on Crime Against Women and Children, Minister Mahmood Ali Held High Level Police Officers Meeting on Crime Against Women and Children, Home Minister Mahmood Ali Held High Level Police Officers Meeting on Crime Against Children, Home Minister Mahmood Ali Held High Level Police Officers Meeting on Crime Against Women, High Level Police Officers Meeting on Crime Against Women and Children, Minister Mahmood Ali Held High Level Police Officers Meeting, High Level Police Officers Meeting, Police Officers Meeting, Crime Against Women and Children, Crime Against Children, Crime Against Women, Telangana Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో గురువారం “మహిళలు మరియు పిల్లలపై నేరాలు” పై హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజేపీ, సీనియర్ మరియు ఇతర పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే ఘోరమైన మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు ఈ సమావేశంలో లోతైన చర్చలు జరిపామని హోంమంత్రి తెలిపారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ మహిళల భద్రత మరియు రక్షణలో మరియు శాంతిభద్రతలు పటిష్టంగా నిర్వహించడంలో బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉందని, ఈ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ పనితీరు ప్రశంసనీయమని అన్నారు. పబ్బులు మరియు మొదలగు ప్రదేశాల్లో ఉల్లంఘనలను అరికట్టేందుకు పోలీసు శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం ప్రకారం అన్ని పోలీస్ కమీషనరేట్లలో పోలీసు నిఘా పెంచి, చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు షీ టీమ్స్ విద్యా సంస్థలు, పాఠశాలల యాజమాన్యాల ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి తద్వారా పార్టీలు, ఈవెంట్లు మొదలగు వాటి పేరుతో జరగడానికి అవకాశమున్న విషయాలపై వారికి పూర్తి అవగాహన ఉండేటట్లు చర్యలు తీసుకుంటారని మహమూద్ అలీ తెలిపారు. పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా అవసరమైన చర్యలు తీసుకుంటాయని చెప్పారు. మహిళా సేఫ్టీ వింగ్ మహిళా సంక్షేమం మరియు శిశు అభివృద్ధి శాఖ అధికారులతో కూడా సమావేశమవుతుందని మరియు మహిళలు మరియు పిల్లలపై వేధింపులు మరియు నేరాల నివారణకు అన్ని ఆచరణీయమైన మరియు సాధ్యమైన చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్రతో సహా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని హోంమంత్రి అన్నారు.

రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్‌లలో మహిళలు, చిన్నారులపై నేరాలను నియంత్రించేందుకు, ఉల్లంఘనలను నిరోధించేందుకు హైదరాబాద్ సిటీ యాక్ట్ సెక్షన్ల కింద వీలైనంత వరకు నిఘా ఉంచేందుకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని మహమూద్ అలీ తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, సీఐడీ డీజీ గోవింద్ సింగ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి.ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, హైదరాబాద్ అదనపు అదనపు పోలీస్ కమీషనర్ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత డీఐజీ సుమతి సహా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + five =