కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి, ఆరురోజుల పాటు వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవం

6 Day Mahayagya Concluded at Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by MLC Kavitha, 6 Day Mahayagya Concluded at Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by TRS MLC Kavitha, 6 Day Mahayagya Concluded at Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by Kavitha, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple, 6 Day Mahayagya Concluded, 6 Day Mahayagya Concluded at Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by Kavitha, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by TRS MLC Kavitha, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Constructed by MLC Kavitha, TRS MLC Kavitha, MLC Kavitha, Kavitha, 6 Day Mahayagya, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple News, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Latest News, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Latest Updates, Sri Rajyalaxmi Sameta Sri Laxmi Narsimha Swamy Temple Live Updates, Mango News, Mango News Telugu,

నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం సీహెచ్‌ కొండూర్‌ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్‌ దంపతులు పునఃనిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు జాన్ 4 ప్రారంభంపై జూన్ 9 వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆరు రోజుల పాటుగా అద్భుతంగా సాగిన ప్రతిష్టాపన మహోత్సవం గురువారం సంపూర్ణమైంది. ఆరో రోజైన జూన్ 9, గురువారం నాడు ఆలయంలో ప్రాణప్రతిష్ఠ, సంప్రోక్షణ, విమాన శిఖరం, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు కుటుంబ సమేతంగా యాగం నిర్వహించారు. అనంతరం కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని భక్తులు పెద్ద సంఖ్యలో తొలి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శానికి భక్తులు బారులు తీరడంతో ఆలయం వద్ద రద్దీ నెలకుంది.

ఇక ఆరో రోజున జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కవిత తల్లి, సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఆలయంలో ఆరు రోజుల పాటుగా కార్యక్రమాలు నిర్వహించిన వేదపండితుల బృందాన్ని, దేవాలయ నిర్మాణానికి భూదానం చేసిన దాతలను ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులు ఘనంగా సన్మానించారు.

ఆలయ జీర్ణోద్ధరణ వేడుకలు ఘనంగా జరగడంపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ, “శ్రీ రాజ్యలక్ష్మి సమేత‌ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆరు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆద్యంతం సహకరించిన పొతంగల్, సీహెచ్ కొండూర్ గ్రామ ప్రజలకు, కార్యక్రమంలో భాగస్వామ్యులైన మీడియా, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ రాజ్యలక్ష్మీ సమేత‌ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ ఆలయంలో భక్తులకు గురువారమే దర్శనాలు ప్రారంభమవగా, సాయంత్రం నరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి ఆధ్వర్యంలోని వేదపండితుల బృందం స్వామివారి తిరుకళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించింది. అలాగే ఇకపై ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, స్వామివారి జయంతి ఘనంగా నిర్వహించుకోవచ్చని భార్గవ నరసింహస్వామి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here