హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్‌

Indian Racing League to be held in Hyderabad on December 10 and 11th,Indian Racing League,Indian Racing League Hyderabad,2022 Indian Racing League,Indian Racing League 2022,Mango News,Mango News Telugu,Indian Racing League Season Finale,Indian Racing League Returns,Indian Racing League Schedule,Indian Racing League Website,Indian Racing League Timings,Indian Racing League Live,Indian Racing League Teams,Indian Racing League Tickets,Indian Racing League Chennai Tickets,Indian Racing League Hyderabad Tickets, Indian Racing League Twitter,Indian Racing League Latest News and Updates

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో నేడు, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్‌ (ఐఆర్ఎల్) ను నిర్వహించనున్నారు. గత నవంబర్ 19, 20 తేదీల్లో కూడా ఐఆర్ఎల్ జరగగా, శని, ఆదివారాల్లో ఐఆర్ఎల్ చివరి సిరీస్‌ జరుగుతుంది. కాగా 2023, ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ సన్నద్దతలో భాగంగా హైదరాబాద్ లో ఈ ఐఆర్ఎల్ ను నిర్వహిస్తున్నారు. తాజా రేసింగ్‌ లో మొత్తం 12 కార్లు, 6 బృందాలు పాల్గొంటున్నాయి. 2.7 కిలోమీటర్ల పొడవైన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌లో అద్భుతమైన, ఆకట్టుకునే రేసును చూసేందుకు హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతానికి ప్రేక్షకులు భారీగా తరలిరానున్నారు.

ఈ పోటీలను చూసేందుకు వచ్చేవారి కోసం రేసింగ్‌ ట్రాక్‌ పొడవునా 7 వేల నుంచి 8 వేల వరకు ప్రేక్షకులు వీక్షించేందుకు సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్కింగ్, ట్రాఫిక్, భద్రతపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఐఆర్ఎల్ దృష్ట్యా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేట‌ర్ల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, వాహ‌న‌దారులను ప్రత్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లో డిసెంబర్ 11 తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.

ఐఆర్ఎల్ వీకెండ్ ప్రొవిజనల్ షెడ్యూల్: హైదరాబాద్

2022, డిసెంబర్ 10 శనివారం:

  • 15:10-15:20: ఇండియన్ రేసింగ్ లీగ్ – క్వాలిఫైయింగ్ 1 (డ్రైవర్ A)
  • 15:30-15:40: ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2 (డ్రైవర్ B)
  • 16:00-16:45: ఇండియన్ రేసింగ్ లీగ్ – రేస్ 1 – స్ప్రింట్ – 20 మినిట్స్
  • 16:45 17:00: పోడియం + ఇంటర్వ్యూలు

2022, డిసెంబర్ 11 ఆదివారం:

  • 12:15-13:00: ఇండియన్ రేసింగ్ లీగ్ – రేస్ 2 – స్ప్రింట్ – 20 మినిట్స్
  • 15:30-16:30: ఇండియన్ రేసింగ్ లీగ్- రేస్ 3 – ఫీచర్ – 35 మినిట్స్
  • 16:30-16:45: పోడియం + ఇంటర్వ్యూలు
  • 18:00-20:30: తమన్ లైవ్ ఇన్ కన్సర్ట్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + three =