‘ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

International Film Festival of India at Goa Megastar Chiranjeevi Received Indian Film Personality of the Year-2022 Award,International Film Festival of India,International Film Festival Goa,Megastar Chiranjeevi,Indian Film Personality of the Year-2022,Indian Film Personality of the Year Award,Mango News,Mango News Telugu,IFFI,Indian Film Personality Of Year,Indian Film Personality Of Year Chiranjeevi,Chiranjeevi,Megastar Chiranjeevi Latest Movies,Megastar Chiranjeevi Latest News and Updates

గోవా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ అవార్డును ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఐఎఫ్‌ఎఫ్‌ఐ ముగింపు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అందుకున్నారు. ఈ అవార్డును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కలిసి చిరంజీవికి అందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్‌, గోవా సీఎం ప్రమోద్ సావంత్, వేడుకలకు హాజరైన సినీరంగ ప్రముఖులు, ఫాన్స్ కు అందరికి ధన్యవాదాలు తెలిపారు. “ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు ప్రదానం చేసినందుకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ, భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇదో గొప్ప గౌరవం. కొన్ని గుర్తింపులు ప్రత్యేకంగా నిలిచిపోతాయి, అలాంటి వాటిల్లో ఇదొకటి. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను, సినీ పరిశ్రమలోకి రాకముందు నేను కొణిదెల శివశంకర ప్రసాద్​ గా ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ కీర్తి, పేరు ప్రతిష్టలు, వెలకట్టలేని అభిమానం చూపించే ఫాన్స్, అనుభవిస్తున్నవన్నీ సినీ పరిశ్రమ వలనే వచ్చాయి. సినీ పరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నాను. శివశంకర ప్రసాద్​ గా జన్మనిచ్చిన నా తల్లిందండ్రులకు, చిరంజీవిగా పునర్జన్మనిచ్చిన సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. 45 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్నాను, ఇందులో 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంత భయపడినా, అభిమానులు, ప్రేక్షకులు, ప్రజల ప్రేమలో ఎలాంటి మార్పు లేదు, నాపై చెక్కు చెదరని అభిమానం అలాగే ఉంది, ఇంకా రెట్టింపు అయింది. సినిమాలను ఎప్పుడూ వదలను, జీవితాంతం సినిమాల్లోనే ఉంటానని ఫాన్స్ కు హామీ ఇస్తున్నాను. తెలుగు అభిమానులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారి ప్రేమకు నేను దాసోహం. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది, ఇలాంటి గొప్ప అవార్డ్స్ పొందే అవకాశం కల్పించింది. అవార్డు వచ్చిన సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. నా కెరీర్ లో సహకరించిన స్నేహితులు, డైరెక్టర్స్, నిర్మాతలు, తోటి నటీనటులు, టెక్నీషియన్స్, అందరికి కృతజ్ఞతలు” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =