తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉంటారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

T-Congress MLA Jagga Reddy Sensational Comments Over TPCC Chief Revanth Reddy,Congress MLA Jaggareddy,Revanth Reddy will be PCC chief, Revanth Reddy till the next elections in Telangana,MLA Jaggareddy,PCC chief Revanth Reddy,T-Congress MLA Jagga Reddy,TPCC Chief Revanth Reddy,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డే పీసీసీ చీఫ్‌గా ఉంటారని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోమవారం ఆయన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని దించెయ్యాలని తాను ఎన్నడూ అనలేదని, ఎన్నికల వరకూ ఆయననే కొనసాగించాలని అధిష్టానాన్ని కోరుతున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానని, అలాగే ఆయన పాదయాత్ర చేస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని స్ఫష్టం చేశారు. అయినా అన్ని రాజకీయ పార్టీలలో అసమ్మతి ఉంటుందని, అది సహజమని, అయితే దీనిని కొందరు కోవర్టులు అంటున్నారని పేర్కొన్నారు.

ఇక తాను మొదటి నుంచి పీసీసీ కావాలని అడుగుతున్నానని, అది తనకు వచ్చే వరకూ అడుగుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయన్ను దించేయాలని రేవంత్ రెడ్డి అభిమానులు అధిష్టానానికి లేఖలు రాయలేదా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సమిష్టి నిర్ణయాలే లేవని, ఏ నిర్ణయమైనా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్నారని అన్నారు. జగ్గారెడ్డి పార్టీ కోసం పని చేస్తాడని, అయితే తాను మట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలహీనం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, ఈ మేరకు బీజేపీ అగ్రనేత అమిత్ షా మరియు సీఎం కేసీఆర్‌ల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. ఇక తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, అయినా ముక్కుసూటిగా మాట్లాడటం తన నైజమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 12 =