తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజ‌నీ కుమార్

IPS Officer Anjani Kumar Takes Charge as the New Director General of Police Telangana,Senior IPS Officer Anjani Kumar,Took Over As DGP Of Telangana,DGP of Telangana,Mango News,Mango News Telugu,Telangana DGP Anjani Kumar,Senior IPS Officer Anjani Kumar,Anjani Kumar Ips Wikipedia,Anjani Kumar Ips Current Posting,Anjani Kumar Ips Birth Place,Hyderabad Police Commissioner Name List,Anjani Kumar Ips Contact Number,Anjani Kumar Ips Wife,Anjani Kumar Ips Family,Anjani Kumar Ips Office Address,Sri Anjani Kumar Ips,Anjani Kumar Ips Salary,Anjani Kumar Ips Son,Anjani Kumar Ips Age

తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి అంజ‌నీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇప్పటివరకు డీజీపీగా విధులు నిర్వర్తించిన ఎం.మహేందర్ రెడ్డి నుంచి డీజీపీ గా అంజ‌నీ కుమార్ బాధ్యతలు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీవీ ఆనంద్, మ‌హేశ్ భ‌గ‌వ‌త్ సహా పలువురు పోలీసు ఉన్న‌తాధికారులు పాల్గొని, అంజ‌నీ కుమార్‌ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి నేడు (డిసెంబర్ 31, శనివారం) ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న నేప‌థ్యంలో ఏసీబీ డీజీగా విధులు నిర్వర్తిస్తున్న అంజ‌నీ కుమార్ ను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోఆర్డినేషన్), తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) పదవీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. 1990 ఐపీఎస్ అధికారి అయిన అంజ‌నీ కుమార్ జనగామ ఏఎస్పీగా, మహబూబ్‌నగర్‌ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌), ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీ, గుంటూరు, నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ డీఐజీ, గ్రేహౌండ్స్‌ చీఫ్‌, వరంగల్‌ ఐజీ, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌, ఏసీబీ డీజీగా ఇలా ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 2 =