ఆర్‌ఆర్‌ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలవాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena chief Pawan Kalyan Wishes that RRR's Natu Natu Song Should Win Oscar Award,RRR's Natu Natu Song,Should Win Oscar Janasena Chief Pawan Kalyan,Natu Natu Song Gets Oscar Nomination,Mango News,Mango News Telugu,Jr Ntr,Akshay Kumar,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates,RRR Songs,RRR Video,Naatu Naatu Song Lyrics,Natu Natu Song,Rahul Sipligunj Naatu Naatu,RRR Natu Natu Song,RRR Natthu Nattu Song,RRR Natu Natu Song Singer Name,RRR Natu Natu Song Choreographer Name,RRR Natu Natu Video Song,RRR Natu Natu Video Song Download,RRR Natu Natu Song Dance Master,RRR Natu Natu Song Lyrics In Telugu,RRR Movie Natthu Nattu Song,RRR Songs Tamil Nattu Nattu

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల బరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, లిరిక్స్: చంద్రబోస్, గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ చేయబడింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంతో దర్శకుడు రాజమౌళికి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణికి, ఆర్ఆర్ఆర్ నటులు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లకు, చిత్ర బృందానికి దేశంలోని పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆర్‌ఆర్‌ఆర్ లోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఆర్ఆర్ఆర్. చిత్రంలోని ‘నాటు..నాటు’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన ఎమ్.ఎమ్.కీరవాణికి హృదయపూర్వక అభినందనలు. నాటు నాటు గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, నిర్మాత డి.వి.వి.దానయ్య, గీత రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here