హోలీ పండుగ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. పండుగ సందర్భంగా శాంతి భద్రతలు, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని మార్చి 6, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి మార్చి 8, బుధవారం ఉదయం 6 గంటల వరకు వైన్‌షాపులు, బార్లను, కల్లు దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు ఆంక్షల విధింపుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా ఎవరైనా మందుతాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హోలీ సందర్భంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించడం, రంగులు లేదా రంగు నీరు చల్లడాన్ని ఇష్టపడని వ్యక్తులపై చల్లి అసౌకర్యం కలిగించడం, రోడ్లు, వాహనాలపై రంగులు చల్లడం, టూ వీలర్, ఇతర వాహనాలపై గుంపులుగా రోడ్లపై తిరగడం వంటి చర్యలను నిషేదిస్తునట్టు ప్రకటించారు. ఎవరైనా వ్యక్తులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాలు మూసివేస్తున్న నేపథ్యంలో మద్యం ప్రియులు ఆదివారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE