హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రమాదం.. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు గాయాలు

Bollywood Superstar Amitabh Bachchan Injured During Project K Film Shooting In Hyderabad,Bollywood Superstar Amitabh Bachchan,Amitabh Bachchan Injured During Project K,Project K Film Shooting In Hyderabad,Amitabh Injured In Hyderabad During Project K Film,Mango News,Mango News Telugu,Bollywood Legend Amitabh Bachchan Injured,Amitabh Bacchan Injured During Film Shoot,Amitabh Bachchan Injures Rib Cage,Amitabh Bachchan Gets Injured,Hyderabad Film News And Updates,Telangana Latest News

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం షూటింగ్‌లో జరిగిన ఒక ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆయన ముంబై లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో అమితాబ్ గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో ఆయనకు కుడి వైపు పక్కటెముక కండరాలకు గట్టి దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై అమితాబ్ బచ్చన్‌ను హైదరాబాద్‌లోని ఏఐజీ సపత్రికి తరలించారు. అక్కకి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అలాగే గాయం నుండి కోలుకోవడానికి దాదాపు 2 వారాల సమయం పడుతుందని, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అమితాబ్, ముంబై చేరుకున్నారు.

ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌ తన ఆరోగ్య అప్‌డేట్‌ను బ్లాగ్‌లో పంచుకున్నారు. ఊపిరి పీల్చుకునేటప్పుడు మరియు కదులుతున్నప్పుడు చాలా బాధ కలుగుతోందని, నొప్పి నివారణకు మందులు తీసుకుంటున్నానని అమితాబ్ వెల్లడించారు. అలాగే ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా వేయబడిందని, బెడ్ రెస్ట్‌లో ఉంటానని చెప్పారు. ఇంకా, ఈ సాయంత్రం తన నివాసం ‘జల్సా’ వెలుపల అభిమానులను చూడటం కుదరదని, అభిమానులెవరూ తన కోసం రావొద్దని వారిని కోరారు. కాగా బాహుబలితో ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ మరియు దీపికా పదుకొణె నటిస్తోన్న ఈ పాన్-ఇండియా సైన్స్-ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె జనవరి 12న థియేటర్లలోకి రానుంది. తెలుగు పరిశ్రమలో దీపికా పదుకొణె అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 6 =