తెలంగాణ ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : మెగాస్టార్ చిరంజీవి

Bathukamma festival, Bathukamma Festival 2021, Bathukamma Festival Greetings to Telangana People, Bathukamma Festival Start from Today, Chiranjeevi Extends Bathukamma Festival Greetings, Mango News, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Extends Bathukamma Festival Greetings to Telangana People, Megastar Chiranjeevi’s Bathukamma festival, Megastar Chiranjeevi’s Bathukamma festival greetings, Telangana Bathukamma Festival

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6, బుధవారం నుండి తొమ్మిది రోజుల పాటుగా ఈ సంవత్సరపు బతుకమ్మ ఉత్సవాలను ప్రజలు జరుపుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.

“ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =