ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్‌జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదల

Andhra minister releases results of RGUKT, AP RGUKT CET Results 2021, AP RGUKT CET results 2021 released, AP RGUKT CET-2021 Results, AP RGUKT Results, AP RGUKT Results 2021, Mango News, Minister Adimulapu Suresh, Minister Adimulapu Suresh Released RGUKT CET-2021 Results, Minister Adimulapu Suresh Released RGUKT CET-2021 Results Today, RGUKT CET Result 2020 Released, RGUKT CET-2021 Results

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ను సెప్టెంబర్ 26వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సుమారు 73వేల మంది దరఖాస్తు చేసుకోగా, 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (ఎస్ఎస్ఎన్ కాలేజ్)లో బుధవారం నాడు ఆర్‌జీయూకేటీ సెట్-2021 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఫలితాలను http://www.rgukt.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

రికార్డు సమయంలో కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ పక్రియను కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి టాప్ 10 ర్యాంకుల వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన మధ్దన గుణశేఖర్ మొదటి ర్యాంకు, కడప జిల్లాకు చెందిన శ్రీ చక్రధరణి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన ఎం.చంద్రిక మూడో ర్యాంకు సాధించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్ లలో అడ్మిషన్స్ చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =