ఎన్టీఆర్ జయంతి: నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Megastar Chiranjeevi Pawan Kalyan Ram Charan Pay Tributes NTR On his Birth Anniversary, Ram Charan Pay Tributes NTR On his Birth Anniversary, Pawan Kalyan Pay Tributes NTR On his Birth Anniversary, Megastar Chiranjeevi Pay Tributes NTR On his Birth Anniversary, NTR Birth Anniversary, Megastar Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Veteran actor and politician Nandamuri Taraka Rama Rao's birth anniversary, Veteran actor Nandamuri Taraka Rama Rao's birth anniversary, politician Nandamuri Taraka Rama Rao's birth anniversary, Nandamuri Taraka Rama Rao's birth anniversary, Nandamuri Taraka Rama Rao, NTR Birth Anniversary News, NTR Birth Anniversary Latest News, NTR Birth Anniversary Latest Updates, NTR Birth Anniversary Live Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. “తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తులలో ఎన్.టి.రామారావు గారు కూడా ఒకరని పేర్కొన్నారు. “సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజులలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్.టి.ఆర్. నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు నన్నెంతగానో ఆకట్టుకునేది. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను ఆయన దేశం నలుదిశలా వ్యాపింపచేసిన తీరు అమోఘం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారతదేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఎన్.టి.రామారావు గారి జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పూన అంజలి ఘటిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ “భారతీయ సినిమా గర్వించదగ్గ మన నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు. సినిమా చూడటమే కాకుండా అందులో భాగమవ్వాలని లక్షలాది మందిని ప్రేరేపించిన లెజెండ్‌ని స్మరించుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =