కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ శిక్షపై ఇస్లామిక్‌ దేశాల కూటమి విమర్శలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌

India Slams Islamic Nations Group OIC Remarks Over Yasin Malik Verdict, OIC Remarks Over Yasin Malik Verdict, India Slams Islamic Nations Group OIC, Yasin Malik Verdict, India Slams Islamic Nations Group, India Slams Islamic Nations Group for Comments on Yasin Malik Court Ruling, Yasin Malik Court Ruling, Organization of Islamic Cooperation, India criticises OIC-IPHRC, Yasin Malik, Yasin Malik Verdict News, Yasin Malik Verdict Latest News, Yasin Malik Verdict Latest Updates, Yasin Malik Verdict Live Updates, Mango News, Mango News Telugu,

కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు సంబంధించిన టెర్రర్ ఫండింగ్ కేసులో తీర్పుపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) ఐపీహెచ్ఆర్సీ చేసిన విమర్శలపై భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యాసిన్ మాలిక్‌కు సంబంధించి మేరకు ఎన్ఐఏ కోర్టు తీర్పుపై ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఆ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతు తెలిపిందని, ఇది సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. ప్రపంచం ముప్పుకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సమర్థించవద్దని ఆయన ఓఐసీని కోరారు.

యాసిన్ మాలిక్ ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన అతని కార్యకలాపాలను డాక్యుమెంట్ చేసి కోర్టులో హాజరుపరిచామని బాగ్చి తెలిపారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. కోర్టు మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ, రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది. అతనికి రెండుసార్లు జీవిత ఖైదు పడింది. మే 19న దోషిగా తేలిన ఈ ఉగ్రవాద నాయకుడికి మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోరగా, జీవిత ఖైదు విదిస్తూ తీర్పునిచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here