తెలుగు సినీ పరిశ్రమకు సీఎం కేసీఆర్ హామీలు, కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi, CM KCR, CM KCR for Relief Measures to the Film Industry, CM KCR Special Promises to Telugu Film Industry, GHMC Elections, KCR Special Promises to Film Industry, Mango News, Megastar, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Thanks to CM KCR, Relief Measures to the Film Industry, Telugu Film Industry, TRS Manifesto, TRS Manifesto For GHMC Elections

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగు సినీపరిశ్రమకు సంబంధించి పలు హామీలను ఇచ్చారు. కరోనాతో కుదేలై ఆర్ధికంగా నష్టపోయిన సినిమా రంగాన్ని ఆదుకుంటామని, చిత్ర పరిశ్రమను పునరుజ్జీవింపచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుసినీ పరిశ్రమ కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

“కరోనాతో కుదేలైన సినిమారంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబ్స్మంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్ లో షోలను పెంచుకునేందుకు అనుమతి. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్టసమయంలో ఇండస్ట్రీకీ, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకి ఎంతో తోడ్పాటుగా వుంటాయి. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో, ఆయన విజన్ కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది” అని చిరంజీవి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =