త్వరలో తెలంగాణ ఆరోగ్యశాఖలో 12,755 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Announces Health Department To Be Issued Notification For 12755 Posts Soon, Harish Rao Announces Health Department To Be Issued Notification For 12755 Posts Soon, Telangana Minister Harish Rao Announces Health Department To Be Issued Notification For 12755 Posts Soon, Telangana Health Department To Be Issued Notification For 12755 Posts Soon, Health Department To Be Issued Notification For 12755 Posts Soon, Notification For 12755 Posts, Recruitment For Doctor Posts Soon, Recruitment notification for 1326 doctor posts will be issued in the next few days announced state health minister T Harish Rao, Health Minister Harish Rao gave some clarity on notification for government doctor posts, state health minister T Harish Rao, 13K jobs in health department, 13K jobs in Telangana Health Department, government doctor posts, Telangana Government Doctor Posts News, Telangana Government Doctor Posts Latest News, Telangana Government Doctor Posts Latest Updates, Telangana Government Doctor Posts Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఆరోగ్య శాఖలో 12,755 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ) రిజర్వేషన్లను అనుసరించాలని, ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా రిక్రూట్‌మెంట్ జరిగేలా చూడాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిలో మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా 10,028 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.

ఆరోగ్య శాఖలో ల్యాబ్ అసిస్టెంట్లు, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్లు వంటి టెక్నికల్ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక నిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను నిమ్స్ మెడికల్ బోర్డు స్వతంత్రంగా భర్తీ చేస్తుందని, మిగిలిన పోస్టులను టీఎస్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సూపర్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, నర్సులు మరియు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు పోస్టులను టీఎస్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భర్తీ చేస్తుందని తెలిపారు. ఆయుష్ విభాగంలోని నర్సుల పోస్టులను కూడా బోర్డు ద్వారా భర్తీ చేస్తామని, ఆయుష్ వైద్యులను బోధనా సిబ్బందిగా మార్చే ప్రక్రియను చేపడతామని, ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో ఒకటి లేదా రెండు రోజుల్లో మొదటి దశలో 1,326 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ తర్వాత స్టాఫ్ నర్సుల నియామకం జరగనుండగా, ఆరోగ్య శాఖలో 12,755 ఉద్యోగాల కోసం ఇది మొదటి అధికారిక ప్రకటన. మరో రెండు, మూడు వారాల్లో దశల వారీగా మిగిలిన ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇక కోవిడ్ మహమ్మారి సమయంలో తమ సేవలను పొడిగించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 20 శాతం వెయిటేజీ అందించనున్నారు. ఆరోగ్య రంగంలోని వివిధ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు వారానికోసారి నోటిఫికేషన్‌లను విడుదల చేయనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =