మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Minister Harish Rao Announces Notification To be Released For 1140 Assistant Professor Posts in Two Days, Notification For 1140 Assistant Professor Posts, Harish Rao Announces Notification For 1140 Assistant Professor Posts, 1140 Assistant Professor Posts, Notification For 1.4K Assistant Professor Posts Soon, Mango News, Mango News Telugu, TS Govt Jobs 2022, Notification for 1.4K Assistant Professor Posts, Telangana Job Notification 2022, Telangana Govt Jobs 2022, Telangana Jobs Notification, Telangana Job Notification 2022 , TS Govt Jobs , Latest Govt Jobs in Telangana 2022 , Govt Jobs Latest News And Updates

తెలంగాణలో దాదాపు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత కొన్ని నెలల క్రితం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. దీనిపై దృష్టి సారించిన అధికారులు అప్పటినుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒక కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాబోయే కొన్ని వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల కొరత తీర్చేందుకు మరియు మెడికల్‌ కాలేజీల్లో టీచింగ్‌ విభాగంలో ఖాళీల భర్తీకి మొత్తం 2140 మంది వైద్యుల నియామకాన్ని చేపట్టనున్నామని తెలిపారు. దీనిలో భాగంగా మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఇంకో పది రోజుల్లో 1000 మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 14 =