ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ, బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Distributes Bathukamma Sarees in hyderabad, Talasani Srinivas Yadav Distributes Bathukamma Sarees, Minister Talasani Srinivas Yadav, Bathukamma Sarees, Bathukamma Sarees Distribution, Bathukamma Sarees, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, పేద, మద్య తరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 18 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

30 రకాల డిజైన్ లు, వివిధ రంగులతో రాష్ట్రంలోని చేనేతలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో చేనేతలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు. అలాగే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 52,261 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పుట్టి రాష్ట్రానికే పరిమితం అయిన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, ఇది మనకెంతో గర్వకారణమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ ఇలా అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, యూసీడీ పీడీ నీరజ, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here