పదేళ్లలో కాంగ్రెస్‌ 6వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Says Congress Govt Gives Only 6000 Jobs in Ten Years But BRS Provided 1.35 Lakh Jobs,Harish Rao Says Congress Govt Gives Only 6000 Jobs,Congress Govt Gives Only 6000 Jobs in Ten Years,BRS Provided 1.35 Lakh Jobs,Harish Rao Says BRS Provided 1.35 Lakh Jobs,Mango News,Mango News Telugu,Minister Harish Rao,Minister Harish Rao Latest News,Minister Harish Rao Latest Updates,Minister Harish Rao Live News,Minister Harish Rao Live Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. శుక్రవారం ఆయన నల్గగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మరో మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనను చూసి యావత్‌ దేశమే గర్విస్తుందని, కేంద్రం ఇచ్చే అవార్డులే మన పనితీరుకి నిదర్శనమని పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌ తప్ప మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్‌ పాలన బాగోలేదు కాబట్టే ప్రజలు కేసీఆర్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని అనాన్రు. ఇక పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌ 6 వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ పాలనలో 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం లేదని.. కాంగ్రెస్‌ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందని ఎద్దేవా చేసిన మంత్రి హరీశ్‌ రావు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అసలు అభ్యర్థులే లేరని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =