హైద‌రాబాద్‌ మైనర్ బాలిక ఘటన, నిందితుల అరెస్టు.. కేసు వివరాలు వెల్లడించిన వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌

Hyderabad Minor Girl Molestation Case West Zone DCP Press Meet on Accused Detain and Case Details, Minor Girl Molestation Case West Zone DCP Press Meet on Accused Detain and Case Details, West Zone DCP Press Meet on Accused Detain and Case Details, Hyderabad Minor Girl Molestation Case, Minor Girl Molestation Case, Hyderabad Teen Gang Raped In Mercedes By 5 Minors Including MLAs Son, an incident of gang rape was reported on the 3rd of June, Hyderabad’s Jubilee Hills, 17-year-old victim said That she was attacked by five minors who molested and gang-raped her in a Mercedes car, Mercedes car, gang-raped , 17-year-old Teen, 5 Minors, Hyderabad minor gang-raped in car, Hyderabad teen gang-raped in car, Hyderabad minor allegedly raped in Mercedes car, a minor girl was allegedly molested and gang-raped in a Mercedes car, Mango News, Mango News Telugu,

హైద‌రాబాద్‌లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక ఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయ‌ల్ డేవిస్. ఈ ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం ఆయ‌న మీడియా స‌మావేశంలో కేసు పూర్వాపరాలను వివరించారు. ఈ కేసులో మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఘటన జరిగిన జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌, బేకరీతో పాటు పలు ప్రాంతాల్లో సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశామని వెల్లడించారు. బాలికపై అత్యాచారం జరిగిన మాట వాస్తవమేనని, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించామని పేర్కొన్నారు.

బాలిక‌పై లైంగిక‌దాడి జ‌రిగింద‌ని ఆమె తండ్రి మే 31న ఫిర్యాదు చేశాడ‌ని, ఆయన ఫిర్యాదు మేర‌కు జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు న‌మోదు చేశామ‌ని జోయ‌ల్ డేవిస్ చెప్పారు. కాగా ఈ ఘ‌ట‌న త‌ర్వాత రెండు రోజులు పాటు ఆ బాలిక షాక్‌లో ఉంద‌ని పేరెంట్స్ చెప్పార‌ని, దీంతో మ‌హిళా పోలీసుల‌తో బాలిక‌కు కౌన్సిలింగ్ ఇప్పించామ‌ని తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితులు పాల్గొన్నారని, అయితే వారిలో ఇద్ద‌రు మేజ‌ర్లు, ముగ్గురు మైన‌ర్లని.. అందుకే వారిపై పోక్సో, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నామ‌ని, మ‌రో ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు జోయ‌ల్ డేవిస్ తెలిపారు.

వారు గోవాకు పరారయ్యారని సమాచారం అందిందని, దీంతో రెండు బృందాలుగా పోలీసులు గోవాలో వెతుకుతున్నారని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అయితే ఈ అత్యాచార ఘటనలో రాష్ట్ర హోం మంత్రి మనవడు ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తి నిరాధారం అని, అలాగే ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా ల‌భించ‌లేద‌ని డీసీపీ జోయ‌ల్ డేవిస్ సృష్టం చేశారు. సీసీ కెమెరాల్లో వారు ఎక్కడా కనిపించ లేదని, అన్నీ పరిశీలించాకే వారికి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలిపారు. కాగా ఈ కేసులో ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. అయితే అతడు మైనర్‌ కావడంతో వివరాలు వెల్లడించలేకపోతున్నట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 3 =