రాజకీయాలకు బాసర ట్రిపుల్ ఐటీ వేదిక కావద్దు, ఆందోళ‌న విర‌మించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి

Minister Sabitha Indra Reddy Letter to Basara IIIT Students to Withdraw Their Protest, Telangana Minister Sabitha Indra Reddy Letter to Basara IIIT Students to Withdraw Their Protest, Sabitha Indra Reddy Letter to Basara IIIT Students to Withdraw Their Protest, Letter to Basara IIIT Students to Withdraw Their Protest, Basara IIIT Students to Withdraw Their Protest, Basara IIIT Students Protest, Telangana Minister Sabitha Indra Reddy, Telangana Education Minister Sabitha Indra Reddy, Education Minister Sabitha Indra Reddy, Minister Sabitha Indra Reddy, Sabitha Indra Reddy, Telangana Education Minister, Education Minister, Basara IIIT Students Protest News, Basara IIIT Students Protest Latest News, Basara IIIT Students Protest Latest Updates, Basara IIIT Students Protest Live Updates, Mango News, Mango News Telugu,

నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. “మీ సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ ని నియమించడం జరిగింది. ఉన్నత విద్యామండలి వైస్-ఛైర్మన్ వెంకటరమణను కూడ మీ దగ్గరికి ప్రభుత్వం పంపించింది. దయచేసి వారితో చర్చించండి. మీ సమస్యలను తక్కువ చేయటం నా ఉద్దేశ్యం కాదు. ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటి ఉంది. ఈ కమిటీ యూనివర్సిటీ కమిటి అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవలసిన అంశాలను, ఆందోళనలతో మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన మాత్రమే నాది. కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా క్లాన్లు సరిగ్గా నడవక, చిన్న చిన్న అంశాలను పరిష్కరించడంలో కొంత భాష్యం జరిగి ఉండవచ్చు” అని అన్నారు.

“ఈ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన స్టూడెంట్స్ ని తీసుకొని వారి భవిష్యత్ ను ఉజ్వలంగా తీర్చిదిద్దాలనే సంకల్పం తెలంగాణ రాగానే సీఎం కేసీఆర్ 1000 నుండి 1500 వరకు విద్యార్థుల అడ్మిషన్స్ ను పెంచడం జరిగింది. మంచి ఫలితాలను ఈ యూనివర్సిటీ విద్యార్థులు సాధించారు. సాధిస్తుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మన బాసర విద్యార్థులను క్యాంపస్ నియామకాలకు సెలెక్ట్ చేసుకుంటున్నాయి. అటువంటి అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలుగవద్దని మాత్రమే కోరుతున్నాను. రాజకీయాలకు ఈ యూనివర్సిటీ వేదిక కావద్దని నా విజ్ఞప్తి. గత కొన్ని రోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు. ఒక అమ్మగా బాధేస్తుంది. “ఇది మీ ప్రభుత్వం” దయచేసి చర్చించండి. ఆందోళనను విరమించండి. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ బంగారు భవిష్యత్తే మీ తల్లిదండ్రుల కల. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల కూడా అదే, మీరు భవిష్యత్ లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here