“టీ- కల్చర్” యాప్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud, Sports Minister Srinivas Goud, Srinivas Goud Launched T- Culture Mobile APP, T- Culture Mobile APP, T- Culture Mobile APP for Artists, T- Culture Mobile APP for Artists in Telangana, telangana

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సహకారంతో రూపొందించిన “టీ- కల్చర్” ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు ఆవిష్కరించారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు తో కలసి ఈ యాప్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కళల ఖజానాగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులున్నారు. వారందరికి సంబంధించిన డేటా బేస్, ఆన్ లైన్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు కళాకారులను మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కళాకారులకు పూర్వవైభవం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలనే సంకల్పంతో మధ్యవర్తులకు తావు లేకుండా, మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా ఆన్ లైన్ ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేసే విధానం చేపట్టినట్టు తెలిపారు. కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలును యాప్ ద్వారా ప్రజలకు, కళాకారుల సమాచారం కోసం ప్రత్యేకంగా టీ- కల్చర్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ దేశంలోనే మొదటి ప్రయత్నం అని మంత్రి పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాకారులకు సైతం సులభంగా ఉండేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేగాక, కళాకారులకు ఐడీ కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని మీ-సేవ తో అనుసంధానం చేశామన్నారు. ఐడీ కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, వారి కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ-సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ ఐడీ కార్డ్ ను పొందవచ్చని మంత్రి వెల్లడించారు. ఈ యాప్ సౌకర్యం ఆగస్టు 1, 2020 నుండి అందుబాటులో ఉంటుందన్నారు. మొదటి కార్డును కవి, కళాకారుడు గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 6 =