మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

Anand Mahindra, Mahindra Group launches university, Mahindra University, Mahindra University in Hyderabad, Mahindra University launched in Hyderabad, Minister KTR, Minister KTR Participated in a Virtual Launch of Mahindra University, Virtual Launch of Mahindra University

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో కలిసి మహీంద్రా విశ్వవిద్యాలయం వర్చువల్ ప్రారంభోత్సవంలో ‌తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం, బహదూర్‌పల్లిలో 130 ఎకరాల విస్తీర్ణంలో మహీంద్రా యూనివర్సిటీ ‌ని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌, మీడియా, లా, డిజైన్ తదితర కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా మహీంద్రా యూనివర్సిటీ గుర్తింపు పొందనుంది. ఈ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్‌ మాట్లాడుతూ ఈ యూనివర్సిటీ ఏర్పాటులో ఆనంద్‌ మహీంద్రా క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పారు. మహీంద్రా గ్రూపుకు‌ అభినందనలు తెలియజేశారు. ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలని మంత్రి కేటిఆర్ సూచించారు. ఆనంద్‌ మహీంద్రా మాట్లాడుతూ, కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని కూడా హాజరయ్యారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =