కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్

MLC Kalvakuntla Kavitha Took First Dose of COVID-19 Vaccine today at NIMS Hospital,Mango News,Mango News Telugu,MLC Kalvakuntla Kavitha,Kalvakuntla Kavitha,MLC Kalvakuntla Kavitha Took First Dose of COVID-19 Vaccine,COVID-19 Vaccine,MLC Kavitha Took First COVID-19 Vaccine Dose,MLC Kavitha COVID-19 Vaccine,MLC Kalvakuntla Kavitha Takes First Shot Of Covid-19 Vaccine,TS News,Kavitha,Kavitha Latest News,Kavitha Live,Kavitha Latest,Covid-19,Coronavirus Vaccine,Coronavirus,Telangana,MLC Kavitha Takes Covid-19 Vaccine First Dose In NIMS Hospital,MLC Kavitha Gets COVID-19 Vaccine Shot,Corona Vaccination in Telangana,MLC Kavitha Takes Covid Vaccine,MLC Kavitha Covid Vaccine

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నట్టు వెల్లడించారు. “మనమందరం మరియు మన ప్రియమైన వారికి త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. మరోసారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు మాస్క్ ధరించాలని కోరుతున్నాను” అని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్ కూడా సోమవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ మాట్లాడుతూ, “కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల మధ్య మనమంతా బాధ్యతగా ఉండాలి మరియు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించాలి. కరోనా వ్యాక్సిన్ తీసుకోండి, సురక్షితంగా ఉండండి” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − four =