హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ ఏర్పాటు.. 200 మిలియ‌న్ US డాల‌ర్ల భారీ పెట్టుబ‌డి

Drilling Rigs In Hyderabad, Drillmake is another international company based in Hyderabad, Drillmec SpA Signed MoU with Dept of Industries, Drillmec SpA Signed MoU with Dept of Industries Telangana, Mango News, MEIL group’s Drillmec to set up USD 200 million oil rig manufacturing hub, MEIL’s Drillmec to set up $200 million oil rig, MEIL’s Drillmec to set up $200 mn oil rig manufacturing hub in Telangana, MOU Signed Between Govt of Telangana and Drillmec, MOU Signed Between Govt of Telangana and Drillmec To Set Up USD 200 Million Oil Rig Manufacturing Hub, MOU Signed Between Govt of Telangana and Drillmec To Set Up USD 200 Million Oil Rig Manufacturing Hub in Telangana, telangana, USD 200 Million Oil Rig Manufacturing Hub in Telangana

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ ఏర్పాటు కానుంది. ప్రముఖ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్‌మెక్‌ హైద‌రాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గుల‌ను త‌యారు చేయ‌టానికి డ్రిల్‌మెక్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో డ్రిల్‌మెక్ మరియు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసింది. ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుతో తెలంగాణ‌లో ఉపాధి అవకాశాలు భారీగా కలుగనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలియజేసారు.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో డ్రిల్‌మెక్ ఏర్పాటుతో కొత్త‌గా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఆయిల్ రిగ్గుల త‌యారీలో అంత‌ర్జాతీయంగా డ్రిల్‌మెక్‌ గుర్తింపు పొందింది. సుమారు 200 మిలియ‌న్ US డాల‌ర్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. కేంద్ర సహకరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 13 =