గవర్నర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee, Mamata Banerjee Blocks Bengal Governor, Mamata Banerjee Blocks Governor Jagdeep Dhankhar on Twitter, Mamata blocks Governor Dhankar on Twitter, Mango News, West Bengal, West Bengal CM, West Bengal CM blocks Governor Dhankhar on Twitter, west bengal cm mamata banerjee, West Bengal CM Mamata Banerjee Blocks Governor Jagdeep Dhankhar, West Bengal CM Mamata Banerjee Blocks Governor Jagdeep Dhankhar on Twitter, West Bengal News, West Bengal Political News

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి నిర్ణయం అయినాసరే వెరవకుండా తీసుకోగలరు. తాజాగా ఆమె మరోసారి ఇలాంటి వైఖరితో వార్తల్లోకెక్కారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ను ట్విట్టర్‌లో బ్లాక్‌ చేశారు మమత. ఈ విషయాన్ని సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ట్వీట్‌ల వల్ల నేను చిరాకు చెందాను. అందుకే, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌లో అతన్ని బ్లాక్ చేశాను’ అని ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్‌ ఎవరిని లెక్క చేయడం లేదని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే, గవర్నర్ ధన్‌ఖర్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కూడా సీఎం ఆరోపించారు.

ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని తన కింద కార్మికులుగా చూస్తూ ప్రతిరోజూ గవర్నర్‌ ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని బెదిరించే ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు మమతా బెనర్జీ. ఆయనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పలుమార్లు లేఖలు రాసినట్టు, అయినా గవర్నర్‌ను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు మమత. తాను స్వయంగా వెళ్లి కూడా గవర్నర్‌తో మాట్లాడానని పేర్కొన్నారు. అయినా ఆయన వినడం లేదని అందరినీ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు మమత. గవర్నర్ తీరుతో గత ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పంపిన ప్రతి ఫైలు పెండింగులో పెడుతున్నారని, విధాన నిర్ణయాలపై ఆయనెలా మాట్లాడతారని మండిపడ్డారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి నాలుగు ఉత్తరాలు కూడా రాసినట్టు తెలిపారు మమత.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eighteen =