కళాతపస్వి కె.విశ్వనాథ్ తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం: బాలకృష్ణ

Nandamuri Balakrishna Expressed his Grief on Demise of Legendary Tollywood Director K Viswanath,Nandamuri Balakrishna Expressed Grief,Demise of K Viswanath,Legendary Tollywood Director K Viswanath,Mango News,Mango News Telugu,K Viswanath Movies,K Viswanath Young,K Viswanath Wikipedia,K. Viswanath Son,K Viswanath Last Movie,K Viswanath Age,K Viswanath Songs,K Viswanath Super Hit Movies,K Viswanath Best Movies,K Viswanath Movies Hits And Flops List,K Viswanath Family Photos,K Viswanath Kamal Hassan Movies,K Viswanath Chiranjeevi Movies,K Viswanath Young Photos,Director K Viswanath,Kamal Haasan And K Viswanath Movies,Kashi Vishwanath,Kavita Viswanath,Kashi Vishwanath Temple,Kasi Viswanath Director,Kavita Viswanath And Gavaskar,Kashi Vishwanath Images Hd,Kasinathuni Viswanath

ప్రముఖ దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి, పద్మశ్రీ కె.విశ్వనాథ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, కళా తపస్వి కె.విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు అని అన్నారు.

“భారతీయ సంస్కృతీ సంప్రదాయలు మరీ ముఖ్యంగా మన తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణము. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చి ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fifteen =