కైకాల సత్యనారాయణ మరణం దిగ్భ్రాంతి కలిగించింది, ఆయన సేవలు మరువలేనివి: నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Expressed his Grief on Demise of Telugu Veteran Actor Kaikala Satyanarayana,Nandamuri Balakrishna Grief on Kaikala Satyanarayana,Tollywood Actor Kaikala Satyanarayana Passes Away,Kaikala Satyanarayana Passes Away,Kaikala Satyanarayana,Ex-MP Kaikala Satyanarayana Passes Away,Mango News,Mango News Telugu,Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana Death,Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Wife,Kaikala Satyanarayana Wikipedia,Kaikala Satyanarayana Cast Name,Kaikala Satyanarayana Son,Kaikala Satyanarayana Is Alive,Telugu Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana Actor,Kaikala Satyanarayana Kgf,Actor Kaikala Satyanarayana,Actor Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana And Kgf

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రముఖ అగ్రనటుడు, నందమూరి బాలకృష్ణ అన్నారు.

“కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణకి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =