కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

PM Narendra Modi Mourned the Demise of Tollywood Veteran Actor Kaikala Satyanarayana,Many Film And Political Celebrities, Including Prime Minister Modi, Mourned The Death Of Kaikala Satyanarayana,Mango News,Mango News Telugu,Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana Death,Kaikala Satyanarayana Health,Kaikala Satyanarayana Wife,Kaikala Satyanarayana Wikipedia,Kaikala Satyanarayana Cast Name,Kaikala Satyanarayana Son,Kaikala Satyanarayana Is Alive,Telugu Actor Kaikala Satyanarayana,Kaikala Satyanarayana Actor,Kaikala Satyanarayana Kgf,Actor Kaikala Satyanarayana,Actor Kaikala Satyanarayana Age,Kaikala Satyanarayana And Kgf

ప్రముఖ సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, “ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేస్తూ, “ప్రముఖ చలనచిత్ర నటుడు, నవరస నటనా సార్వభౌముడిగా ఖ్యాతి గాంచిన శ్రీ కైకాల సత్యనారాయణ గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. మంచి నటనతో పాటు చక్కని వ్యక్తిత్వం కలిగిన వారి జీవితం ముందుతరాలకు ఆదర్శనీయమైనది.వివిధ పౌరాణిక, సాంఘిక పాత్రల్లో వెండితెరపై కైకాల సత్యనారాయణ నటవిశ్వరూపాన్ని చూసిన ఎవరైనా మంత్రముగ్ధులు అవుతారని చెప్పటంలో సందేహం లేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 9 =