గ్రూప్-4 పోస్టులకై ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ వాయిదా, ఎప్పటినుంచి ప్రారంభమంటే?

TSPSC Announces Online Applications will Commence for Group-4 Posts from December 30 and Last Date is January 19th,Postponement of online application,Group-4 posts online application,Group 4 Notification 2022 Telangana Qualification,Group 4 Notification 2022 Telangana Last Date To Apply,Group 3 Notification 2022 Telangana,Mango News,Mango News Telugu,Group 4 Notification 2022 Telangana Syllabus,Group 4 Notification 2022 Telangana Date,Tspsc Group 4 Notification 2022 Pdf Download,Group 2 Notification 2022 Telangana,Groups Notification 2022 Telangana,Group 4 Jobs Notification 2022 Telangana,Group 4 Jobs List In Telangana 2022 Notification,Group 4 Posts In Telangana 2022 Notification,Group 4 Notification 2022 Telangana Eligibility,Group 4 Notification 2022 Telangana Syllabus In Telugu,Group 4 Notification 2022 Telangana In Telugu,Telangana State Group 4 Notification 2022,Group 4 Notification 2022 Telangana Apply Online

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 కింద 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌, వార్డ్‌ ఆఫీసర్‌ సహా పలు రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. ముందుగా ఈ గ్రూప్-4 పోస్టుల కోసం అర్హులైన అభ్య‌ర్థులను 2022, డిసెంబర్ 23వ తేదీ నుంచి 2023, జనవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అయితే తాజాగా గ్రూప్-4 పోస్టులకై ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ వాయిదా పడింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు 2022, డిసెంబర్ 30వ తేదీ నుండి ప్రారంభమవుతాయని మరియు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023, జనవరి 19వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. గ్రూప్-4 సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ http://www.tspsc.gov.in ని సందర్శించి, నిర్దేశించిన ప్రొఫార్మాలో డిసెంబర్ 30 నుండి జనవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =