తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ నియామకం

Senior IAS officer Vikas Raj Appointed as Chief Electoral Officer of Telangana State, Vikas Raj Appointed as Chief Electoral Officer of Telangana State, Senior IAS officer Vikas Raj, IAS officer Vikas Raj, Chief Electoral Officer of Telangana State, CEO of Telangana State, Senior IAS officer Vikas Raj Appointed as CEO of Telangana State, Vikas Raj Appointed as CEO of Telangana State, Telangana State CEO, Chief Electoral Officer, CEO, Senior IAS officer, IAS officer, Vikas Raj, Telangana State CEO Latest News, Telangana State CEO Latest Updates, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ వికాస్‌రాజ్‌ నియమించబడ్డారు. 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన వికాస్‌రాజ్‌ ప్రస్తుతం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రాజకీయ వ్యవహారాల ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. తెలంగాణ సీఈవోగా ఉన్న శశాంక్‌ గోయల్‌ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లడంతో, కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి బుద్ధప్రకాశ్‌ ఇంచార్జ్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం పూర్తిస్థాయి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా వికాస్‌రాజ్‌ ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సీఈవోగా బాధ్యతలు చేపట్టాక వికాస్‌రాజ్‌ రాష్ట్రంలో ఇతర ఏ పోస్టుల్లో కొనసాగరాదని, అదనపు బాధ్యతలు కూడా చెప్పకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్‌ కుమార్‌ శర్మ బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + six =