57.26 లక్షల రైతుల ఖాతాల్లో 6272.55 కోట్ల రైతుబంధు నగదు జమ

Funds for Rythu Bandhu Scheme, Mango News Telugu, Rythu Bandhu Distribution, Rythu Bandhu Funds Distribution, Rythu Bandhu Money, Rythu Bandhu Scheme Laetst News, Rythu Bandhu Scheme Latest Update, Rythubandhu, Rythubandhu Distribution, Rythubandhu Distribution In telangana, Rythubandhu Scheme, Rythubandhu Scheme News, Rythubandhu Scheme Status, Rythubandhu Scheme updates, Telangana Rythubandhu Distribution

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం వరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలియజేశారు. “యాసంగి-2020 సీజన్ కు గాను తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం పెట్టుబడి సహాయము క్రింద ఈ రోజు వరకు 57,26,418 మంది రైతులకు 125.45 లక్షల ఎకరాలకు గాను 6272.55 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది” అని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి తెలిపారు.

ముందుగా యాసంగి సీజన్ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 60,88,402 మంది రైతులకు 149.50 లక్షల ఎకరాలకు గాను 7474.78 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28, 2020 నుండి జనవరి 8, 2021 వరకు విడతల వారీగా ఎకరాకు 5000 వేల రూపాయల చొప్పున రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తూ వస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =