సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీకి సిద్ధం.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Telangana BJP MLA Etela Rajender Announces Ready To Contest Against CM KCR at Gajwel, BJP MLA Etela Rajender Announces Ready To Contest Against CM KCR at Gajwel, MLA Etela Rajender Announces Ready To Contest Against CM KCR at Gajwel, Etela Rajender Announces Ready To Contest Against CM KCR at Gajwel, Contest Against CM KCR at Gajwel, Etela Rajender Announces Ready To Contest Against CM KCR, MLA Etela Rajender Says He Will Contest Against CM KCR, BJP MLA Etela Rajender Open Challenge To CM KCR, CM KCR Vs Etela Rajender War, Telangana BJP MLA Etela Rajender, BJP MLA Etela Rajender, MLA Etela Rajender, Telangana BJP MLA, Gajwel Assembly Constituency News, Gajwel Assembly Constituency Latest News, Gajwel Assembly Constituency Latest Updates, Gajwel Assembly Constituency Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు శనివారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. నా ప్రస్తానం మెదలైందే గజ్వేల్ నుంచి అని, సీఎం కేసీఆర్‌పై పోటీకి ఎప్పుడైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి పోటీ చేసే విషయమై ముందే సమాచారమిచ్చానని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే గజ్వేల్‌లో క్షేత్రస్థాయిలో వ్యూహాల అమలుకు ప్రణాళికలు వేస్తున్నామని ఈటల రాజేందర్ వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలంటే ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలని ఈటల పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి తరహాలోనే ఇక్కడ కూడా కేసీఆర్‌ను ఓడించి తీరుతానని ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రశ్నించే తత్వం తెలంగాణ మట్టిలోనే ఉందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, త్వరలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని ఈటల రాజేందర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 15 =