తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 32,224 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 10,354 శాంపిల్స్ పరీక్షించగా 9076 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 762, రంగారెడ్డిలో 171, మేడ్చల్ లో 85, సంగారెడ్డిలో 36, నల్గొండలో 32, కామారెడ్డిలో 23, మెదక్ లో 22, ఖమ్మంలో 18, మంచిర్యాలలో 17, సూర్యాపేటలో 14, ఆదిలాబాద్ లో 14, మహబూబ్ నగర్ లో 14 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 10, సాయంత్రం 5 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 32,224
కొత్తగా నమోదైన కేసులు (జూలై 9- జూలై 10 (5PM-5PM) : 1278
నమోదైన మరణాలు : 8
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 19,205
యాక్టీవ్ కేసులు : 12,680
మొత్తం మరణాల సంఖ్య : 339
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu