నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌, తెలంగాణలో 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి

Telangana Finance Dept Accorded Permission For Filling-Up Of 9168 Group4 Vacant Posts,Telangana Unemployed, Finance Department Filling Of 9168 Group-4 Posts,Telangana Group-4 Posts,Group4 Vacant Posts,Telangana Group-4 Posts,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా 9,168 గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలో యువత ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ లో భాగంగా 9,168 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ శుక్రవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది.

గ్రూప్-14 పోస్టుల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “9,168 గ్రూప్-4 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. వాగ్దానాలను నెరవేర్చే మరియు అమలు చేస్తున్న నాయకుడు అయిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతిని ఇచ్చింది. ఆశావహులకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.

 

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =