హైదరాబాద్ నగరంలో శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates 2.81 kms Long Bi-directional Flyover from Shilpa Layout to Outer Ring Road,,Telangana Minister KTR,Shilpa Layout Flyover,KTR To Launch Shilpa Layout Flyover,Mango News,Mango News Telugu,Shilpa Layout Flyover Latest News And Updates,Shilpa Layout Flyover News And Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Update

హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్ సమీపంలోని శిల్పా లే అవుట్ నుండి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు 2.81 కిలోమీటర్ల పొడవైన ద్వి దిశాత్మక ఫ్లైఓవర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, పి.మహేందర్ రెడ్డి, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) కింద జీహెఛ్ఎంసీ గత 6 సంవత్సరాలలో 33 ప్రాజెక్ట్ లు పూర్తి చేయగా, ఇది 17వ ఫ్లైఓవర్ అని పేర్కొన్నారు. అలాగే 1 కేబుల్ వంతెన, 15 ఆర్యుబీ, ఆర్వోబీ, అండర్ పాస్‌లు పూర్తయ్యాయని, మరో 14 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ ద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ మధ్య రోడ్ కనెక్టివిటీ పెరగడంతో పాటుగా, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ పొడవు 956 మీటర్లు కాగా, వెడల్పు 16.60 మీటర్లతో ఉంది. దీన్ని 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌ విస్తరిస్తున్న వేగానికి అనుగుణంగా 2014-15లో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ( ఎస్‌ఆర్‌డీపీ)ని సీఎం కె.చంద్రశేఖరరావు ఆలోచించారని చెప్పారు. గడిచిన ఆరేళ్లలో 48 ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుల్లో 33 పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్-2ను చేపడతామని తెలిపారు. అంతేకాకుండా నగరంలో 710 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారులు భారీ వర్షాలకు దెబ్బతినకుండా చూసేందుకు సీఆర్ఎంపీ తీసుకోబడిందని మరియు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి లింక్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అలాగే ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు హైదరాబాద్ మెట్రో లైన్‌ను 63-కిమీలు పొడిగించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో బీహెఛ్ఈఎల్ నుండి లక్డికాపూల్ వరకు 26-కిమీలు, నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు 5-కిమీలు మరియు విమానాశ్రయం నుండి మైండ్‌స్పేస్ వరకు 32-కిమీల లైన్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =