తెలంగాణలో ఇంజినీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త, మరో 1,663 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Telangana Finance Dept Gives Green Signal to Recruit 1663 Vaccant Posts in Engineering Department, TS Finance Dept Gives Green Signal to Recruit 1663 Vaccant Posts in Engineering Department, Recruit 1663 Vaccant Posts in Engineering Department, Engineering Department, Recruit 1663 Vaccant Posts, Telangana Finance Dept Gives Green Signal to Recruit 1663 Vaccant Posts, State Government has given the green signal for filling up 1663 vacancies in different departments, 1663 vacancies in different departments, TS Govt Jobs, finance department has given green signal for filling up another 1663 vacancies, Telangana State Finance department, Finance department, Telangana Finance Dept, Telangana State Finance department Recruitment News, Telangana State Finance department Recruitment Latest News, Telangana State Finance department Recruitment Latest Updates, Telangana State Finance department Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించి 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే గ్రూప్-1 సహా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్, రవాణా మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వంటి డిపార్ట్మెంట్స్ కు సంబంధించి పలు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభ‌వార్త అందింది. రాష్ట్రంలో మరో 1,663 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ శనివారం అనుమతులు మంజూరు చేసింది. తాజాగా అనుమతులు ఇచ్చిన జాబితాలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోనే 1522 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్ డిపార్ట్మెంట్ లో 53 , డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో 88 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన మొత్తం పోస్టుల సంఖ్య 46,998కు చేరుకుంది.

తాజాగా అనుమతి లభించిన పోస్టుల వివరాలివే (1,663):

  • ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ – 1238 పోస్టులు
  • ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఆర్ అండ్ బి, ఎన్ హెఛ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ఆర్యూబీఎస్,హెచ్ఓడీ) – 284 పోస్టులు
  • డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్ డిపార్ట్మెంట్ – 53 పోస్టులు
  • డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ – 88 పోస్టులు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =